'పేట' ప్రీ రిలీజ్ ఫంక్షన్..

SMTV Desk 2019-01-05 19:06:55  Rajinikanth, Petta, Sankranthi Realese, Pre Release

హైదరాబాద్, జనవరి 5: సూపర్ స్టార్ రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేసిన పేట సినిమా పూర్తిగా మాస్ అంశాలతో నిర్మితమైంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకువస్తుంది. తమిళనాట అదే రోజు రిలీజ్ అవుతున్న అజిత్ సినిమా విశ్వాసం తో పోటీపడటానికి రజనీ పేట రంగంలోకి దిగిపోయింది. అదే రోజున ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. తెలుగులో గట్టిపోటీ ఉన్నప్పటికీ, పేట వెనకడుగు వేయకుండా వచ్చేస్తోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ముహూర్తాన్ని ఖరారు చేసింది.

ఆదివారం(జనవరి 6) రాత్రి 7 గంటలకు హైదరాబాద్ - సైబర్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పలువురు సినీప్రముఖులు ఈ వేడుకకి హాజరు కానున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ .. విజయ్ సేతుపతి .. బాబీ సింహా పాత్రలు ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతున్నాయి.