మరో హార్రర్ థ్రిల్లర్ లో నయనతార

SMTV Desk 2019-01-05 19:05:20  Nayantara, Airaa, Teaser, Tamil

లేడి ఓరియెంటెడ్ పాత్రలో నయనతార ఈ మధ్యలో ఎక్కువగా నటిస్తుంది. తను సినిమాను వొప్పుకుందీ అంటే, ఆ కథలో కొత్తదనం ఉంటుంది అనే నమ్మకాన్ని ఆమె ప్రేక్షకుల్లో కలిగించింది. అలా వచ్చిన చిత్రాలన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అలాగే కథలో కొత్తదనం వుంటే నయనతార తన నటనా పటిమతో మరింత సమర్ధవంతగా నడిపించగలదనే నమ్మకం దర్శక నిర్మాతలలో పెరిగిపోయింది. ఈ కారణంగానే నయనతార ఖాతాలోకి వైవిధ్యభరితమైన చిత్రాలు . .. విజయాలు చేరిపోతున్నాయి.ఇప్పుడు తమిళంలో ఆమె తాజా చిత్రంగా ఐరా రూపొందుతోంది. కేఎమ్ సర్జున్ దర్శకత్వం వహిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్లో నయనతార ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి వొక టీజర్ ను వదిలారు. నయనతార డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తోన్న ఈ టీజర్ .. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. టైటిల్లోను .. టీజర్లోను సీతాకోకచిలుకకి ఇచ్చిన ప్రాధాన్యత ఈ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. గతంలో మాయ (మయూరి) .. డోరా వంటి హారర్ థ్రిల్లర్స్ తో మెప్పించిన నయనతార, మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతోందన్న మాట.