షేర్ మార్కెట్ల ముసుగు దొంగలు అరెస్ట్

SMTV Desk 2019-01-05 19:02:14  Hyderabad, Share market frauds, Cyberabad police, Crimes

హైదరాబాద్, జనవరి 5: నగరంలో షేర్ మార్కెట్లలో అమాయకుల నుండి పెట్టుబడులు పెట్టించి మెల్లగా కోట్లు దండుకుని ప్రజలను మోసం చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు సంస్థలు, నలుగురిపై కేసులు నమోదు చేశామని సిపి సజ్జనార్‌ వెల్లడించారు. సెబీ ద్వారా ఇన్వెస్టిమెంట్‌ సర్టిఫికేట్‌ తీసుకుని ముఠా ప్రారంభించిన సంస్థల్లో 10 వేల మంది వినియోగదారులు ఉన్నారని తెలిపాడు. గతంలో నిందితుల ఖాతాల్లోని రూ.3.5 కోట్లను సీజ్‌ చేశామని సిపి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ ముఠా బాధితులు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుందన్నారు. డీ మార్ట్‌ అకౌంట్‌ వినియోగదారలను టార్గెట్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేముందు కంపెనీల గురించి తెలుసుకోవాలని సజ్జనార్‌ సూచించారు.