ఎన్నికల్లో తన ఓటమిపై స్పందించిన తాటి వెంకటేశ్వరులు

SMTV Desk 2019-01-05 18:46:01  TRS, MLA, Thati venkateshwarlu, Telangana assembly elections

ఖమ్మం, జనవరి 5: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసా ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. అయితే తెరాస నేతలు కూడా పలు నియోజక వర్గాల్లో ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రులు తుమ్మల, చందూలాల్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, పిడమర్తి రవి వంటివారు ఓటమి పాలయ్యారు. ఖమ్మం జిల్లాలో టిటిడిపి అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో తెరాస మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరులు ఓడిపోయారు.

తన ఓటమిపై స్పందిస్తూ, “యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వొకవైపు ఉంటే, మా ఖమ్మం జిల్లా ప్రజలు మరోవైపు నిలిచారు. గత నాలుగేళ్ళలో నా నియోజకవర్గంలో వందలకోట్లు విలువగల అభివృద్ధి పనులు చేయించాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయించాను. కానీ ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని పొరపాట్ల వలన ఓడిపోయాను. కారణాలు ఏవైనప్పటికీ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాను. రాజకీయాలలో గెలుపోటములు సహజమే. కనుక యధాప్రకారం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాను,” అని తాటి వెంకటేశ్వరులు చెప్పారు.