పూరి కథపై ఆసక్తి చూపని విజయ్ దేవరకొండ..

SMTV Desk 2019-01-05 18:37:25  Vijay Devarakonda, New Movie, Dear Comrade Kakinada, puri jagannath

హైదరాబాద్, జనవరి 5: యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కాకినాడలో దాదాపు రెండు నెలలపాటు షూటింగ్ జరిపారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండను దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి కథ చెప్పారు. కానీ విజయ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, పూరి మాత్రం రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్' ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ .. ఫస్టులుక్ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

దీంతో విజయ్ తో చేయాలనుకున్న కథనే రామ్ తో పూరి చేస్తున్నాడని సమాచారం. కథ నచ్చకపోవడం వల్లనే సైలెంట్ అయ్యాడని, నచ్చితే విజయ్ దేవరకొండ డేట్స్ సర్దుబాటు చేసేవాడేననీ అంటున్నారు. ఆ కథ పట్ల విజయ్ అంతగా ఆసక్తిని చూపకపోవడంతో, రామ్ తో పూరి ముందుకు వెళుతున్నాడని చెప్పుకుంటున్నారు. విజయ్ దేవరకొండకి చెప్పిన కథ .. రామ్ తో చేస్తున్న కథ వొకటో కాదో పూరికే తెలియాలి.