ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖారారు...

SMTV Desk 2019-01-05 18:22:05  TRS, KCR, MLA, Assembly formation

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈనెల 17 నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు పలు వర్గాలు చెప్పుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డేట్స్ ఫిక్స్ అయిన నేపథ్యంలో ఈనెల 16న అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో సాయంత్రం 5 గంటలకు ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆ మరుసటి రోజు 17న ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేరోజు స్పీకర్ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. ఈనెల 18న స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ ఎన్నిక అనంతరం అదేరోజు బిఏసీ సమావేశం జరగనుందని తెలపింది. ఈనెల 19న శాసన సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈనెల 20న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉండబోతుంది.