ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రోటెం స్పీకర్ గా ప్రకటించిన సీఎం

SMTV Desk 2019-01-05 18:10:25  Mumtaaz ahmed khan, KCR, Protem speaker, TRS

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుండి తెరాస ఎమ్మెల్యేలు తాము అసెంబ్లీలో ఎప్పుడు అడుగుపెడతామా అని వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు. కాని ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది చెప్పకుండానే తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ ను మాత్రం ప్రకటించేశారు. ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రోటెం స్పీకర్ గా కేసీఆర్ ఎంపిక చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన వారిలో సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్. ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇప్పటి వరకు ఆరు సార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు అవకాశం కల్పించడంతో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. యాకుత్ పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈయన ఆరుసార్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సార్లు ఆయన విజయకేతనం ఎగురవేశారు.