బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న గీత గోవిందం

SMTV Desk 2019-01-05 17:20:35  Geeta Govindham, Remake, Bollywood

గత ఏడాది విడుదలై విజయం సాధించిన గీత గోవిందం చిత్రాన్ని తాజాగా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన‌ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 15, 2018 న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల‌లోనే కాక ఓవర్సీస్ లోను ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, స‌మంత‌, రామ్ చ‌ర‌ణ్ , అల్లు అర్జున్ తదితరులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. గీతా ఆర్ట్స్ 2 బేన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఇంత భారీ విజ‌యం సాధించినందుకు చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఫీలైంది. గోపి సుంద‌ర్ అందించిన సంగీతం కూడా చిత్ర విజ‌యంలో స‌గ భాగం అయింది.

అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన పెళ్ళిచూపులు హిందీలో రీమేక్ కాగా, అర్జున్ రెడ్డి చిత్రం కూడా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే . దాంతో గీత గోవిందం చిత్రానికి కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై రీమేక్ చిత్రం రూపొంద‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో విజ‌య్ పాత్ర‌ని ద‌ఢ‌క్ ఫేం ఇషాన్ క‌ట్ట‌ర్ చేయ‌నున్నాడ‌ట‌. మ‌రి చిత్రాన్ని ఎవ‌రు తెర‌కెక్కించ‌నున్నారు, కథానాయిక‌గా ఎవ‌రు న‌టించ‌నున్నారు త‌దిత‌ర వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తుంది.