సెన్సార్ పూర్తిచేసుకున్న 'పేట'..

SMTV Desk 2019-01-05 15:55:48  Rajinikanth, Petta, U/A, Sankranthi Realese

హైదరాబాద్, జనవరి 5: సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో చేసిన 2.ఓ సినిమా తర్వాత వస్తున్న పేట సినిమా పూర్తిగా మాస్ అంశాలతో నిర్మితమైంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకువస్తుంది. తాజాగా తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రజనీ లుక్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీ సరసన సిమ్రాన్ .. త్రిష కనిపించనుండటం కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి బరిలో ఈ సినిమా సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి మరి.