ఓవర్సీస్ లో రజనీకాంత్ వర్సెస్ బాలయ్య

SMTV Desk 2019-01-05 15:32:22  Bala krishna, Rajini kanth, Pongal, USA

హైదరాబాద్, జనవరి 5: 2019 సంక్రాంతికి థియేటర్ల దగ్గర సందడి వొక రేంజ్ లో కనిపించనుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు .. రామ్ చరణ్ వినయ విధేయ రామ .. వెంకటేశ్ ఎఫ్ 2 వరుసగా థియేటర్లలోకి దిగనున్నాయి. వీటితో పాటు సూపర్ స్టార్ రజని కాంత్ పెట్ట కూడా పోటీపడనుంది. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంగా కథానాయకుడు , యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చరణ్ మూవీ, పూర్తి వినోద భరిత చిత్రంగా ఎఫ్ 2 , పూర్తి యాక్షన్ నేపథ్యంలో పెట్ట ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అమెరికాలో కూడా ఈ నాలుగు భారీ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా సందడి చేయనున్నాయి.

జనవరి 9న బాలయ్య నటించిన కథానాయకుడు , 10న రజనీకాంత్ నటించిన పెట్ట సినిమాలు రీలీజ్ కానున్నాయి. కథానాయకుడు చిత్రాన్ని ప్రదర్శించబోయే థియేటర్స్ లిస్ట్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. ప్రీమియర్ షో బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి. మరోవైపు, రజనీకాంత్ సినిమా తమిళ వర్షన్ కోసం భారీ సంఖ్యలోనే థియేటర్లను బుక్ చేశారు. ఈ రెండు సినిమాలతో యూఎస్ థియేటర్లు ఫుల్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలు విడుదలైన వెంటనే 11న రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ ... 12న వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 సినిమాలు సందడి చేయనున్నాయి.