మే నెలలో మహేష్ కొత్త చిత్రం..

SMTV Desk 2019-01-05 13:12:23  Mahesh babu, Maharshi, Sukumar, New movie, may

హైదరాబాద్, జనవరి 5: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు. ఇది మహేష్ కి 25వ సినిమా కావడం వలన, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకుడు సుకుమార్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు ఏప్రిల్ లో పట్టాలెక్కనున్నట్టు సమాచారం. అయితే కాస్త ఆలస్యంగా మే నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళుతున్నట్టుగా సమాచారం.

ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్ గా రకుల్ ప్రీతీ సింగ్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ ఆలోచనను విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. మరో స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మే నెలలో మహేశ్ బాబుతో సంబంధం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారని అంటున్నారు. జూన్ నుంచి మహేశ్ బాబు వరుసగా డేట్స్ ఇచ్చాడట. ఫారిన్లో జరిగే షూటింగులో ఆయన పాల్గొంటాడని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.