మళ్ళీ టీవీ యాంకర్ గా చిరంజీవి?

SMTV Desk 2019-01-05 11:03:25  Big boss, Season3, Chiranjivi, Venkatesh

తెలుగు స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ .. బిగ్ బాస్ 2 సీజన్ మంచి సక్సెస్ అయ్యాయి. దాంతో ఈ ఛానల్ వారు బిగ్ బాస్ 3 చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరించే సమయంలో నాని కొన్ని విమర్శలను ఎదుర్కున్నాడు. అందువలన తాను బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరించనని ఆయన చెప్పాడట. దాంతో ఛానల్ నిర్వాహకులు వెంకటేశ్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఇటీవల చిరంజీవి పేరు ప్రచారంలోకి వచ్చింది. రీసెంట్ గా బిగ్ బాస్ 3 నిర్వాహకులు చిరంజీవిని కలిసి ఆయనతో ఈ కార్యక్రమాన్ని గురించి చర్చలు జరిపారని సమాచారం. ఆయనని వొప్పించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నట్టుగా చెబుతున్నారు. గతంలో చిరంజీవి ఇదే ఛానల్లో మీలో ఎవరు కోటీశ్వరుడు కి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. చిరంజీవి .. వెంకటేశ్ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా వున్నారు. ఇద్దరిలో ఎవరు వొప్పుకున్నా ఓకే చెప్పేయాలనే నిర్ణయంతో నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.