జూలై నెలలో అంతర్జాతీయ వైద్య సదస్సు

SMTV Desk 2019-01-04 19:19:23  American Association of Physicians of Indian Origin, International Medical Conference, July, Hyderabad

హైదరాబాద్, జనవరి 4: ఈ ఏడాది జూలై 21వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వైద్యులకు ప్రపంచస్థాయి మెళకువలు, సాంకేతిక పరిజ్ఞానం, వైద్య పరిశోధనల పై అవగాహన కల్పించడంలో భాగంగా హెల్త్‌కేర్ సదస్సు నిర్వహించనున్నామని ఆపి(అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ పిజిషీయన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్)ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన వివరాలను వెల్లడించి, బ్రోచర్‌ను విడుదల చేశారు. జూలైలో నిర్వహించనున్న ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 మంది వైద్యనిపుణులు, 500మంది ప్రతినిధులు పాల్గొంటారని ఆపి ప్రతినిధి డా.సురేశ్‌రెడ్డి తెలిపారు. సదస్సులో భాగంగా 8వ అంతర్జాతీయ వైద్య పరిశోధనా పోటీలను సైతం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.