కబడ్డీ.. కబడ్డీ...!

SMTV Desk 2017-07-28 11:06:55  pro kabaddi, 2017, 12 team, telugu taitans

హైదరాబాద్, జూలై 28 : కూతలతో స్టేడియం హోరెత్తించడానికి 12 జట్లు రెడీ అయ్యాయి. గత నాలుగు సీజన్ లో ప్రేక్షకులను ఆనంద పరిచిన ప్రో కబడ్డీ ఇప్పుడు 5వ సీజన్ లో మరింత ఆనందపరచడానికి వస్తుంది. నాలుగు సీజన్స్ లో 8 జట్లుగా ఉన్న ప్రో కబడ్డీ ఇప్పుడు 12 జట్లుకు పెరిగింది. కొత్త జట్లు.. తమిళ తలై వాస్, యూపీ యోధ, హర్యానా స్టిల్లర్స్, గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ కొత్తగా చేరి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 12 జట్లు, 13 వారాలు, 138 మ్యాచ్ లతో హోరెత్తించనున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి లో మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ తలై వాస్ తలపడనున్నాయి. గత నాలుగు సీజన్స్ లో రెండు సార్లు ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ నెగ్గ లేకపోయిన తెలుగు టైటాన్స్. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నాయి. ఈ రోజు నుంచి ప్రారంభ మౌతున్న ఈ ప్రో కబడ్డీ ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.