నాతో డాన్స్ చేయడం చరణ్ కి ఇష్టం : కైరా అద్వాని

SMTV Desk 2019-01-04 17:53:49  Ram Charan, Vinaya Vidheya Rama, Boyapati Srinu, kiara advani

హైదరాబాద్, జనవరి 4: మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో బాలీవుడ్ భామ కైరా అద్వాని తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమా మంచి హిట్ సాధించడంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె ఎంత మాత్రం తొందరపడకుండగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ మాత్రమే అంగీకరించింది. ఆ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమా రామ పేరుతో చరణ్ కనిపిస్తే .. సీత పేరుతో నేను కనిపిస్తాను. కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో సంప్రదాయ బద్ధంగా కనిపిస్తాను. చరణ్ కి .. నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందనే టాక్ మాత్రం తప్పనిసరిగా వస్తుంది. ఈ సినిమాలో రామ లవ్స్ సీత అనే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటలో నేను చరణ్ చాలా బాగా డాన్స్ చేశాము. చరణ్ మంచి డాన్సర్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. అలాంటి చరణ్ .. నాతో డాన్స్ చేయడం అంటే ఇష్టం అని చెప్పినప్పుడు నా ఆనందం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చింది.