'యు' సర్టిఫికేట్ ను పొందిన 'కథానాయకుడు'...

SMTV Desk 2019-01-04 17:36:47  NTR Biopic, Balakrishna, Krish, U Certificate

హైదరాబాద్, జానవారి 4: నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా యన్.టి.ఆర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినీ ప్రయాణం కథానాయకుడు పేరుతోను .. రాజకీయ ప్రస్థానం మహానాయకుడు పేరుతోను ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈ నెల 9న కథానాయకుడు రిలీజ్ కాబోతోంది. తాజాగా కథానాయకుడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ యు సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందడం విశేషం.

ఈ చిత్రంలో రానా, సుమంత్, కల్యాణ్ రామ్, విద్యాబాలన్, రకుల్ ప్రీతి సింగ్, నిత్యామీనన్, హన్సిక ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలకృష్ణ 63 గెటప్స్ లో కనిపించనుండటం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బాలకృష్ణ సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు.