మరోసారి బాలకృష్ణపై నాగబాబు పరోక్ష వ్యాఖ్యలు..

SMTV Desk 2019-01-04 16:35:28  NTR Biopic, Balakrishna, Nagababu, Comments

హైదరాబాద్, జనవరి 4: ఇటీవల జరిగిన ఓక ఇంటర్వ్యూలో నాగబాబు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని అన్నాడు, అప్పుడు యాంకర్ నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదా ? అని అడుగగా ,వెంటనే తేరుకుని వల్లూరి బాలకృష్ణ గొప్ప హాస్య నటుడు ఆయనని మర్చిపోయనేంటి అని సమాధానం ఇచ్చారు. దాంతో సామజిక మాధ్యమాల్లో పెద్ద దుమారమే రేగింది. బాలకృష్ణ అభిమానుల ఆగ్రహానికి కారకులయ్యారు. ఆ తరువాత సారీ చెప్పే నెపంతో బాలకృష్ణ మంచి నటుడు, పెద్ద కమెడియన్, బాగా కామెడీ చేస్తాడు అని చేపి పాత తరం నటుడు అంజి బాబు ఫోటోని చూపించాడు. దీనితో అప్పటివరకు వొక స్థాయి వరకే ఉన్న గొడవలకి ఆజ్యం పోసినట్లుంది.

తాజాగా ఆయన బాలకృష్ణ చేస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ ను టార్గెట్ చేస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి కవిత్వ రూపంలో నాగబాబు చేసిన కామెంట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది."కట్టు కథలు కొన్ని .. కల్పనలు ఇంకొన్ని .. చుట్టనేల .. మూట కట్టనేల .. నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా .. విశ్వదాభిరామ .. వినరా మామా" అంటూ పోస్ట్ పెట్టిన నాగబాబు, కవిత్వాలు మాకు వచ్చండోయ్ అనేది బ్రాకెట్లో పెట్టారు. ఈ పోస్ట్ లో స్టే ట్యూన్డ్ అని వ్యాఖ్యానించడం ద్వారా, ఇకపై తన సోషల్ మీడియా పేజీ నుంచి ఇలాంటి సెటైర్లు వరుసగా ఉంటాయనే హింట్ ఇచ్చారు. నాగబాబు రాసిన ఈ కవితకు మెగా ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మరి ఇది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో చూడాలి.