తెలుగులో మణికర్ణిక ట్రైలర్‌

SMTV Desk 2019-01-04 15:23:10   Kangana Ranuat, Manikarnika, Krish jagarlamudi, Trailer

హైదరాబాద్,జనవరి 4: బాలీవుడ్ సొగసైన నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా హిందీలో మణికర్ణిక చిత్రం రూపొందింది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారముగా ఈ సినిమా తీయబడినది. ఈ సినిమాకి కథా కథనాలను విజయేంద్ర ప్రసాద్ అందించారు. క్రిష్ .. కంగనా దర్శకత్వం వహించిన ఈ సినిమాను, హిందీతో పాటు తెలుగులోను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇప్పటికే హిందీ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తెలుగులోను ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పూర్తి ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ ట్రైలర్‌లో దేశభక్తిని రేకెత్తించేలా ప్రతీ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మనం పోరాడుదాం..మన భావితరాలు స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటాయి.. మీ పోరాటం రేపటి గురించి నేటి కోసం కాదు వంటి సంభాషణలు కూడా అంతే పదునుతో ఉన్నాయి. " ప్రతి భారతీయుడిలోనూ స్వాతంత్య్ర కాంక్షను రగిల్చే కాగడాను అవుతాను నేను . ఝాన్సీ మీకూ కావాలి .. నాకూ కావాలి. మీకు రాజ్యాధికారం కోసం కావాలి .. నాకు మా ప్రజలకి సేవ చేసుకోవడానికి కావాలి అనే డైలాగ్స్ బాగున్నాయి. సాహసవంతురాలైన యువతిగా.. మహారాణిగా .. మాతృమూర్తిగా .. మహా యోధురాలిగా ఈ ట్రైలర్లో కంగనా కనిపిస్తోంది.