తరచుగా టీ తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

SMTV Desk 2019-01-04 15:12:12  Tea, Advantages, Scientist

వేడి వేడి చాయ్ చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో తాగితే వ‌చ్చే మ‌జాయే వేరుగా ఉంటుంది. టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఉత్సాహం ల‌భిస్తుంది.మెదడు చురుగ్గా ప‌నిచేస్తుంది. అందుకే చాలా మంది టీని ర‌క ర‌కాల ఫ్లేవ‌ర్ల‌లో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే నిత్యం టీ తాగే అల‌వాటు ఉన్న‌వారికి ఇప్పుడు సైంటిస్టులు వొక శుభ‌వార్త చెబుతున్నారు. అదేమిటంటే... నిత్యం టీ తాగే వారి ఎముక‌లు దృఢంగా ఉంటాయ‌ట‌. అస‌లు ఎముక‌లు విరిగిపోయే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. ఈ విషయాన్ని చైనా సైంటిస్టులు చెబుతున్నారు.

నిత్యం గ్రీన్ టీ లేదా సాధార‌ణ టీని 30 ఏళ్లుగా తాగుతున్న వ్య‌క్తుల‌పై సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు చేశారు. చైనాలోని పెకింగ్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌బ్లిక్ హెల్త్ స్కూల్ ప‌రిశోధ‌కులు ఇటీవ‌లే ప‌రిశోధ‌న చేశారు. నిత్యం గ్రీన్ టీ లేదా సాధార‌ణ టీని 30 ఏళ్లుగా తాగుతున్న వ్య‌క్తుల‌పై సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు చేశారు. దీంతో తేలిన విష‌యం ఏమిటంటే.. గత 30 ఏళ్లుగా టీ తాగుతున్న వ్యక్తుల‌లో కీళ్లు విరిగిన సందర్భాలు చాలా తక్కువని తేల్చారు. ఈ ప‌రిశోధ‌న‌లో భాగంగా దాదాపు 4 లక్షల 53 వేల 625 మందిని ప్రశ్నించారు. టీ తాగే అలవాటు లేని వారిలో కంటే టీ తాగే వారిలో కీళ్ల ఎముకలు విరిగిన సందర్భాలు అతి తక్కువ అని పరిశొధకులు తేల్చారు. క‌నుక నిత్యం టీ తాగే అల‌వాటు ఉన్న‌వారికి ఈ అంశం ఎంతో మేలు చేస్తుంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.