జగన్ తో పొత్తుకు సిద్దం : తెదేపా ఎంపీ

SMTV Desk 2019-01-04 13:31:23  TDP, MP, JC Diwakar reddy, YSRCP, YS Jagan mohan reddy

న్యూ ఢిల్లీ, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ని మిత్రుడిని చేసుకోవడానికి కూడా తాము సిద్ధమేనని చెప్పారు. కాగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని జగన్ ను కూడా మిత్రుడ్ని చేసుకోవటానికి సిద్దంగా ఉన్నామని దివాకర్ అన్నారు.

రాయలసీమ ముఠా నాయకుడిలా నరేంద్రమోడీ తీరు ఉందని, మోడీ అసమర్థ ప్రధాని అని విమర్శించారు. ప్రధానిగా ఉండి అసత్యాలు మాట్లాడటానికి సిగ్గు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రానికి దుష్టశక్తి అయితే నేడు బీజేపీ దేశానికే దుష్టశక్తి అని ఆయన అన్నారు..