సిట్ విచారణ కు హాజరైన రవితేజ

SMTV Desk 2017-07-28 10:16:46  raviteja drugs case, sit, oficetions, enqary,

హైదరాబాద్, జూలై 28 : డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజకు కూడా నోటిసులు అందిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు సిట్ విచారణకు హాజరైన రవితేజ. ఇప్పటి వరకు ఎనిమిది మందిని విచారించిన సిట్ అధికారులు, తొమ్మిదో రోజు రవితేజ ను విచారించనున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో చాలా కీలకమైన వ్యక్తులు పూరి, రవితేజ లని అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో రవితేజ తమ్ముడు భరత్ చాలా సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ విధంగా రవితేజ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారా? అని సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే పూరి జగన్నాధ్ తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? పూరి మీకు ఎప్పటి నుంచి పరిచయం? పూరి తో కలిసి డ్రగ్స్ తీసుకున్నారా? చార్మి, ముమైత్ తో ఎలాంటి పరిచయం ఉంది? కెల్విన్, జిశాన్ తో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? కెల్విన్ మొబైల్ లో మీ నెంబర్ ఎందుకు ఉంది? కెల్విన్ తో ఎన్ని సార్లు డ్రగ్స్ సరఫరా చేయించుకున్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ రోజు ఈ విచారణ చాలా కీలకంగా మారే అవకాశముందని సమాచారం.