గంటకు రూ. 21,000 చెల్లిస్తున్న సెలీనా గోమేజ్‌..

SMTV Desk 2019-01-04 13:30:55  Salena gomez, Workout, Health

లాస్‌ఏంజెల్స్‌, జనవరి 4: ప్రసిద్ధి చెందిన అమెరికన్ గాయని సెలీనా గోమేజ్‌ చేసే వర్కవుట్ల‌ ఖరీదు గంటకు 300 డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.21,000. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సెలీనా ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత తీవ్ర డిప్రెషన్‌తో బాధపడ్డారు. వాటి నుంచి కోలుకునేందుకు ఆమె వర్కవుట్స్‌ బాటపట్టారు. ముఖ్యంగా ఎక్కువగా హాట్‌ పిలాటిస్‌ క్లాసెస్‌లో పాల్గొంటున్నారట. ఈ వర్కవుట్‌ ద్వారా శరీరానికి వెచ్చదనం తగిలి కండరాలు బలపడతాయని సెలీనా తెలిపారు. దీంతో పాటు తేలిక పాటి వెయిట్‌ లిఫ్ట్స్‌, రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌, జంప్‌ స్వ్కాట్స్‌ చేస్తుంటారట. ఇవన్నీ సెలీనా లాస్‌ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రైవేట్‌గా చేస్తున్న వర్కవుట్స్‌. ఇలా ప్రైవేట్‌గా వర్కవుట్స్‌ చేసుకోవాలంటే గంటకు 300 డాలర్లు చెల్లించాలి


సెలీనాకు కొన్ని నెలల క్రితం ల్యూపస్‌ వ్యాధి సోకింది. దాంతో వొక కిడ్నీ పాడైంది. అప్పుడు ఆమె స్నేహితురాలే సెలీనాకు కిడ్నీ దానం చేసింది. దీని నుంచి కోలుకుంటున్న సమయంలోనే తన మాజీ ప్రియుడు, ప్రముఖ కెనడియన్‌ ఫేమస్ సింగర్ జస్టిన్‌ బీబర్‌ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దాంతో సెలీనా మానసికంగా మరింత కుంగిపోయారు. కొన్నాళ్ల పాటు రిహాబ్‌ సెంటర్లకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. వీటి నుంచి కోలుకోవడానికే సెలీనా రోజూ వందల డాలర్లు ఖర్చుపెడుతూ తన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.