భారీ స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ శాటిలైట్ రైట్స్..

SMTV Desk 2019-01-04 13:14:29  NTR Biopic, Balakrishna, Krish, satilite rites

హైదరాబాద్, జనవరి 4: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్.టి.ఆర్. ఈ చిత్రాన్ని కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న కథానాయకుడు రిలీజ్ కాబోతోంది. రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదలకానుంది. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులు రూ. 80 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, మురళీ శర్మ, కళ్యాణ్ రామ్, రానా, సుమంత్, విద్యాబాలన్, నిత్యామీనన్, రకుల్, హన్సిక తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.