మొదటికొచ్చిన జగన్ ఆస్తుల కేసు

SMTV Desk 2019-01-04 13:06:27  YS Jagan mohan reddy, High court, YSRCP, CBI

అమరావతి, జనవరి 4: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. జగన్ ఆస్తుల కేసు విచారణ మళ్లీ మెుదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో విచారణ మళ్లీ మెుదటి నుంచి చేపట్టే అవకాశం ఉంది. సీబీఐ న్యాయమూర్తి వెంకట రమణ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం వెంకటరమణ సీబీఐ కోర్టు ఇంచార్జ్ న్యామూర్తిగా కొనసాగుతున్నారు.

అయితే శుక్రవారం సెలవు కారణంగా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ ఈనెల 25కు వాయిదా పడింది. ఇకపోతే జగన్ ఆస్తుల కేసులో సీబీఐ 11 చార్జిషీట్ లు దాఖలు చేసింది. వాటిలో మూడు చార్జిషీట్లకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో మళ్లీ విచారణ మెుదటి వచ్చింది.