ప్రధాని మోదీ బయోపిక్ కి టైటిల్ ఖరారు..

SMTV Desk 2019-01-04 12:51:06  Narendra Modi, Biopic, title fixed

ముంబై, జనవరి 4: టాలీవుడ్, బాలీవుడ్ లలో బయోపిక్ ల జోరు మరింత ఊపందుకుంటోంది. ఇప్పటికే కొన్ని బయోపిక్ లు సెట్స్ పై ఉండగా, మరికొన్ని బయోపికలు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కోసం వివేక్ వొబెరాయ్ ను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకి పీఎమ్ నరేంద్ర మోదీ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమాకి వొమంగ్ కుమార్ దర్శకత్వం వహించగా సందీప్ సింగ్ నిర్మిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదలనున్నారు. ఈ నెల 2వ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. వొక టీ అమ్మే సాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోదీ, అంచలంచెలుగా ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయికి రావడం వెనుక ఆయన కృషి .. పట్టుదల .. లక్ష్య సాధన ఎంతో వున్నాయి. వాటన్నింటినీ ఈ బయోపిక్ లో చూపించనున్నారట.