విజయ్ పై మనసు పడ్డ జాన్వీ కపూర్..

SMTV Desk 2019-01-04 12:28:20  Vijay Devarakonda, Janhavi kapoor, crush, love

ముంబై, జనవరి 4: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. విజయ్ తో కలిసి నటించడానికి యువ కథానాయికలు పోటీ పడుతుంటే, ఆయన సినిమాల పట్ల ఎక్కువ శాతం మంది అమ్మాయిలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ .. విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రొద్దున్నే నిద్రలేచే సరికి మేల్ యాక్టర్ గా మారిపోవలసి వస్తే ఎవరిలా మారిపోవాలనుకుంటారు? అనే ప్రశ్నకి ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా, ఇటీవల ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోను ఏ హీరోను చూస్తే మీకు క్రష్ కలుగుతుంది? పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది? అనే ప్రశ్నకి సమాధానంగా ఆమె విజయ్ దేవరకొండ పేరునే చెప్పింది. గీత గోవిందం లోని ఇంకేం ఇంకేం కావాలే .. అనే సాంగ్ అంటే తనకి ఇష్టమనీ .. చాలాసార్లు విన్నానని చెప్పడం విశేషం.