సస్పెండ్ అయి వీరుల్లా బిల్డప్ ఇస్తున్నారు టీడీపి ఎంపీలు : జీవీఎల్

SMTV Desk 2019-01-04 12:21:58  GVL Narashimha rao, BJP, AP Governament, TDP, Chandrababu

న్యూ ఢిల్లీ, జనవరి 4: గురువారం రాజధానిలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరశింహారావు మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండంతస్తుల భవనం కట్టలేని చేతగాని ప్రభుత్వం అతనిది అని ఎద్దేవా చేశారు. అంతేకాక హై కోర్ట్ విభజన గురించి మాకు ముందస్తు సమాచారం లేదని చంద్రబాబు అంటున్నారని, ఆయనకు మతిమరుపు వచ్చిందా అంటూ హేళన చేశారు. ఏం మాట్లాడినా ప్రజలకు తెలుస్తుందిలే అన్న భావనతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని జీవీఎల్ అన్నారు.

లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయించుకుని వీరుల్లా బిల్డప్ ఇవ్వాలన్నట్లు టీడీపీ ఎంపీలు ప్రవర్తించారని దుయ్యబట్టారు. రాజకీయ క్షేత్రంలో ప్రతి వొక్క నాయకుడు ప్రజలకు కూలీలాగే పనిచేయాలని జీవీఎల్ స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయ డ్రామాలు చేసి డ్రామా నాయుడు లాగా ఎదుగుతున్నారని నరసింహారావు వ్యంగ్రాస్త్రాలు సంధించారు. 600 హామీలను ఇచ్చారని, వాటిలో 5 పథకాలను చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానన్ని నిధులు ఏపీకి వస్తున్నాయని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ తెలిపిన విషయాన్ని జీవీఎల్ గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలను తిరిగి అక్కడి ముఖ్యమంత్రులకు గిటార్లు బహుకరించారని దాని వల్ల ఏం సాధించారని జీవీఎల్ ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రూ.500 కోట్లు సాయం చేశారని టీడీపీ నేతలే చెప్పారని ఆయన మండిపడ్డారు. తమ నేతను పొగుడుతున్నారో, తిడుతున్నారో అర్థంకానట్టుగా జేసీ మాట్లాడుతున్నారని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.