రిషబ్ పంత్ రికార్డ్...

SMTV Desk 2019-01-04 12:04:36  Team india, Australia, Test match, Sydney, Rishab pant, Jadeja, Charteshwara pujara

సిడ్నీ, జనవరి 4: సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ విజృంభించాడు. దూకుడుగా తన ఆటను ప్రదర్శించి డబుల్ సెంచరీ దిశగా వెళ్లి (159: 189 బంతులు) నాట్ అవుట్ గా నిలిచాడు. కేవలం 137 బంతుల్లో సెంచరీ చేయడం గమనార్హం. వొకవేళ కోహ్లి భారత తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చెయ్యకపోతే ద్విశతకం సాధించే వాడు ఏమో. 303/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులేసి 622 /7 వద్ద భారత స్కోర్ ను డిక్లేర్డ్ చేసింది. ఈ క్రమంలోనే చతేశ్వర్ పూజారా రెండో రోజు ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. డబుల్ సెంచరీ చేస్తాడనుకుంటున్న క్రమంలో 193 పరుగుల వద్ద అవుటయ్యాడు. అప్పటికీ క్రీజులో ఉన్న పంత్ జడేజా భాగస్వామ్యంతో రెచ్చిపోయాడు.

రిషబ్ మాత్రం భారత వికెట్ కీపర్లలో సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సాధించాడు. గతంలో ఫారూఖ్ ఇంజినీర్ 1967వ సంవత్సరంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆస్ట్రేలియా పర్యటన చేశాడు. ఈ పర్యటనలో 89 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన కీపర్‌గా రికార్డులకెక్కాడు. ఈ రికార్డు మాత్రమే కాకుండా.. పర్యాటక జట్లలో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలు చేసిన పంత్.. రెండు పర్యటనలలోనూ సెంచరీ దాటేశాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ జెప్ఫెరీ డుజోన్ మాంచెస్టర్ వేదికగా, పెర్త్‌లోనూ 1984వ సంవత్సరంలో సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ స్థానంలో బరిలోకి దిగిన రిషబ్ పంత్.. పలుమార్లు ఆసీస్ ప్లేయర్లపై స్లెడ్జింగ్‌కు దిగాడు. ఏకంగా ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌ను 'కేవలం మాటలు మాత్రమే చెప్తాడు ఇంకేం చేయాలో తెలియదు' అంటూ కవ్వింపులకు దిగాడు.