కామారెడ్డిలో 40 కిలోల డ్రగ్స్ పట్టివేత

SMTV Desk 2019-01-03 21:09:34  Drugs, Kamareddy, Illegal, Police

కామారెడ్డి, జనవరి 3: పక్క రాష్ట్రాల నుండి మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను స్వాదీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గుజరాత్ నుండి వివిధ రాష్ట్రాల మీదుగా హైదరాబాద్ కు ఓ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. అయితే అత్యంత రహస్యంగా నిజామాబాద్ మీదుగా ఓ వాహనంలో మత్తుపదార్థాలను తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది.

దీంతో అధికారులు కామారెడ్డి బైపాస్ రోడ్డులో స్థానిక పోలీసుల సాయంతో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ వాహనంలో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను అదికారులు గుర్తించారు. 40 కిలోల వరకు అల్పాజోలం అనే నిషేదిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ తో పాటు తరలిస్తున్న కారును కూడా సీజ్ చేశారు. వాహనంలో పట్టుబడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.