పవన్ కొడుకు సినీ ఎంట్రీ..

SMTV Desk 2019-01-03 19:13:38  pavan kalyan, son, akira nandan, movie entry

హైదరాబాద్, జనవరి 3: అకీరా నందన్ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలిపారు. అకీరాలో ప్రవహిస్తున్నది పవన్ కళ్యాణ్ రక్తమని... ఆ రక్తంలోనే నటన ఉందని ఆమె చెప్పారు. అకీరా సినిమాల్లోకి రావడంపై తనకు ఎలాంటి అభ్యంతరం చెప్పనని... అయితే ముందు తన చదువును పూర్తి చేయాలని తెలిపారు. అకీరా వయసు ప్రస్తుతం 14 సంవత్సరాలని... హీరో అయ్యే టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా సినిమాల్లోకి వస్తాడని చెప్పారు. అకీరా పెదనాన్న చిరంజీవి, అన్నయ్య రామ్ చరణ్ ల ప్రభావం కూడా అకీరాపై ఉంటుందని తెలిపారు.