మరో మెగా హీరోతో కియారా

SMTV Desk 2019-01-03 18:21:49  Allu Arjun, kiara advani, Trivikram

గత సంవత్సరం నా పేరు సూర్య ఫలితంతో కాస్త డీలాపడ్డ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నారు. న్యూ ఇయర్‌ కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ ఉండనుందని ప్రకటించాడు. అయితే మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రయూనిట్‌ తెలిపింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

మహేష్ బాబు భరత్‌ అనే నేను మూవీ ఫేమ్‌ కియారా అద్వాణీని ఈ చిత్రానికి హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘వినయ విధేయ రామ రిలీజ్‌కు రెడీ ఉండగా.. కియారా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఖాయమన్నట్లే కనిపిస్తోంది. వెంటవెంటనే బడా సినిమాలో నటిస్తూ.. ఈ భామ టాప్‌ ప్లేస్‌లోకి దూసుకెళ్లేట్టు కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌హాసిని క్రియేషన్స్‌పై తెరకెక్కించనున్న ఈ చిత్ర షూటింగ్‌ త్వరలోనే భంకానుంది