జనసేనతో కలిసి వామపక్షాలు పోటీ : సీపీఐ నేత

SMTV Desk 2019-01-03 17:51:56  CPI, narayana, janasena, pawan kalyan, tdp, chandrababu

విజయవాడ, జనవరి 3: ఏపీ ముఖ్యమంత్రి నిన్నటి దాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించి ఇప్పుడు పవన్ తో చేతులు కలుపుతాననడం ఆశ్చర్యంగా ఉందంటూ సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఆభయంతోనే పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారని ఆరోపించారు. కాగా జనసేనతో కలిసి వామపక్షాలు పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తాము వామపక్ష పార్టీలతోనే కలిసి పనిచేస్తామని చెప్పడంతో వామపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.