సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇస్తా అంటున్న విజయ్..

SMTV Desk 2019-01-03 17:02:22  Vijay Devarakonda, New Movie, Dear Comrade, Kakinada, Surprise gift

హైదరాబాద్, జనవరి 3: యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సందర్బంగా షూటింగ్ బిజీలో పడి దాదాపు నెలన్నర కాలంలో విజయ్ ఇంటికి వెళ్లలేకపోయాడు. కాగా అభిమానులకు క్రిస్మస్, నూతన సంవత్సర విషెస్ చెప్పేందుకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా తన రౌడీ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించాడు. ఈ మేరకు విజయ్ ఈరోజు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

షూటింగులు, ఇంటర్వ్యూల నేపథ్యంలో నేను దాదాపు నెలన్నర పాటు ఇంటికి రాలేదు. అందుకే మా అమ్మ నాపై కోపంగా ఉంది. కాకినాడలో షూటింగ్‌ చేస్తూ బిజీగా ఉన్నాను. ఇక్కడకు వచ్చిన తర్వాత డబ్బింగ్‌, ఇంటర్వ్యూ, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌తో కొంత బిజీగా ఉన్నాను. అందుకే అమ్మానాన్నలను కలవకలేకపోయాను. మనం మన అమ్మానాన్నలకు ఐ లవ్యూ అని గట్టిగా చెప్పం. మన లైఫ్‌లో ఎక్కువగా ఉండేది వాళ్లే.

అయితే ఈ సంవత్సరం నుంచి మనం అమ్మానాన్నలకు ఐ లవ్యూ చెబుదాం. ఇప్పుడు మా అమ్మకు ఐ లవ్యూ చెప్పి హగ్‌ ఇచ్చి కూల్‌ చేస్తా.. ఆ వీడియోను షూట్‌ చేస్తా. మీరు కూడా మీ అమ్మానాన్నలకు ఐ లవ్యూ చెప్పి హగ్‌ ఇచ్చిన వీడియోలను #deverasanta అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌చేయండి. మీకు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇస్తా అంటూ దేవరకొండ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.