మహేష్ సరసన కత్రినా కైఫ్?

SMTV Desk 2019-01-03 16:58:56  Mahesh babu, Katrina kaif, Sukumar, New movie

హైదరాబాద్, జనవరి 3: ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, పూజ హెగ్డే హీరోయిన్, నరేష్ కీలక పాత్రలో కనబడనున్నారు. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈసినిమా, ఏప్రిల్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ తన తరువాత సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి.

మహేశ్ 26వ సినిమా సుకుమార్ తో ఉండనుంది. ఇప్పటికే సుకుమార్, మహేష్ బాబు కామినేషన్ లో 1 నేనొక్కడినే సినిమాలో మహేష్ నటనకు మంచి ప్రశంశలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సుకుమార్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కత్రినా కైఫ్ ను తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందట. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కెరియర్ ఆరంభంలో కత్రినా టాలీవుడ్ లో మల్లీశ్వరి తో హిట్ సాధించింది. తరువాత బాలకృష్ణతో అల్లరి పిడుగు లో నటించిన ఆమె, హిందీలో స్టార్ హీరోయిన్ గా బిజీ అయింది. మహేశ్ మూవీ కోసం మళ్లీ ఆమెను టాలీవుడ్ కి తెచ్చే ప్రయత్నాల్లో సుకుమార్ బిజీగా వున్నాడని సమాచారం. అదే నిజమైతే కత్రినా రెస్పాన్స్ ఏంటో చూడాలి మరి.