ఏ పార్టీతో పొత్తు లేదు : జనసేన

SMTV Desk 2019-01-03 13:55:26  AP, Assembly elections, Janasena, Pawan kalyan, TDP

అమరావతి, జనవరి 3: రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎదో వొక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని రాజకీయాల్లో పెద్ద చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన పై చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే విధంగా మాట్లాడాడు. అయితే వీటిపై ఎట్టకేలకు జనసేన స్పందించింది.

జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలిసి వెళ్ళము. యువతకు , మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి .
అంటూ జనసేన తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.







ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల పార్థసారధి స్పందిస్తూ తమ పార్టీ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. చంద్రబాబు కావాలనే కుట్రపూరితంగా తమ పార్టీ మీద ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. టీడీపీ, వైసీపీల పప్పులు ఉడకవని ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జనసేనను అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని పవన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయం మరెంతో దూరంలో లేదని జోస్యం చెప్పారు. తమ పార్టీ గుర్తు గాజు గ్లాసుని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వొంటరిగానే పోటీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.