రెండో రోజు ముగిసిన ఆట

SMTV Desk 2017-07-27 18:31:58  india ,vs, srilanka, test, match, 2017

శ్రీలంక, జూలై 27 : తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆలౌట్ అయ్యి 600 పరుగులు చేసింది. శ్రీలంక కు 601 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బ్యాటింగ్ కరునరత్నే 2, తరంగ 64, గుణ తిలక 16, కుశాల్ మెండిస్ 0, డిక్ విల్లా 8, పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం మాథ్యూస్ 54 (బ్యాటింగ్), పెరేరా 6 (బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. శ్రీలంక మొత్తం 5 వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసి, ఇంకా 446 పరుగులు వెనుకబడి ఉంది. ఈ టెస్టు మ్యాచ్ లో భారత్ కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.