రఫేల్‌పై తీర్పును పునఃసమీక్షించండి

SMTV Desk 2019-01-03 13:25:19  Rafale jet Fighter Deal, Yashwant Sinha, prashanth bhushan, arun showri, Supreme court of India

న్యూఢిల్లీ, జనవరి 3: రఫేల్‌ పై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని మాజీ కేంద్ర మంత్రులు అరుణ్‌శౌరీ, యశ్వంత్‌సిన్హా, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ బుధవారం సుప్రీం కోర్టును కోరారు. రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతి జరిగిందన్న పిటిషన్లను కొట్టివేస్తూ, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్‌ 14న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి సంతకాలు లేకుండా ప్రభుత్వం సమర్పించిన సీల్డ్‌కవర్‌ నివేదికపై ఆధారపడి సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించిందని వారు కోర్టుకు విన్నవించారు.

సంతకాలు కూడా లేని సీల్డ్‌కవర్‌ నివేదికపై తీర్పు ఇవ్వడం న్యాయ సూత్రాలకు విరుద్ధమ ని వారు పిటిషన్‌లో వివరించారు. నమ్మశక్యంకాని ఆధారాల ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చిందని అన్నారు. తీర్పును రిజర్వ్‌ చేసిన తరువాత అనేక కొత్త వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, వాటి మూలాల్లోకి వెళ్లి కోర్టు విచారించాలని, ఆ లోపు తీర్పును సమీక్షించాలని వారు కోర్టుకు విన్నవించారు.