వెజ్ సలాడ్ వల్ల ఉపయోగాలు

SMTV Desk 2019-01-03 12:11:32  veg salad, advantages

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా ప్రై చేసిన ఆకుకూరలు, వేపుళ్లను తినడానికి ఇష్టపడుతున్నారు. కూరగాయలను ఎక్కువగా నూనెలో వేయించిన, ఉడికించిన వాటిలో ఉండే పోషకాలు గాల్లో కలుస్తాయి. అలా ఉడికించిన కూరగాయలను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి అప్పుడప్పుడు కూరగాయలను సలాడ్స్‌ మాదిరిగా ఉదయం, సాయంత్ర సమయంలో తీసుకుంటే చాలు మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. టమాటా, క్యారెట్, కీరా, ఉల్లిపాయి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మ రసం వేసి, చివరగా కొత్తిమీర కలిపితే సలాడ్ తయారైపోతుంది.

1. ప్రతిరోజు భోజనంతో పాటు సలాడ్ తీసుకుంటె కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవు.
2. వేసవిలో సలాడ్ తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
3. ఉద్యోగం చేసే వారు ప్రతిరోజు సలాడ్ తినడం అలవాటు చేసుకోవడం అవసరం.
4. సలాడ్ లో కీరదోస ఆరోగ్యమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది .
5. జీర్ణ శక్తి పెంచుతుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న సలాడ్ ను వొకసారి ప్రయత్నించి చూడండి. సలాడ్ తినడానికి సమయం సందర్బం యెమీ అవసరం లేదు, రోజులో ఎప్పుడు తిన్న అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు.