జగన్ తో కేసీఆర్...!!!

SMTV Desk 2019-01-03 12:07:18  YSRCP, YS Jagan mohan reddy, KCR, TRS, Chakrapani reddy

కర్నూలు, జనవరి 3: జిల్లాలో న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్షీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్షీల్లో ఊహించని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోని కూడా పెట్టారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఫ్లెక్షీలో ఓ వైపు శ్రీశైలం నియోజకవర్గ ఇంచార్జ్ శిల్పా చక్రపాణి రెడ్డి, మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేకర్ రావు, మధ్యలో వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలతో ఉన్న ఫ్లెక్షీలను పెట్టారు. ఆ ఫ్లెక్సీని నంద్యాల బండి ఆత్మకూరు రహదారిలో సంతజూటూరు వద్ద ఏర్పాటు చేశారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆ ఫ్లెక్సీని ఆశ్చర్యంగా చూస్తున్నారు.