100 కోట్ల క్లబ్ లో 'సింబా'..

SMTV Desk 2019-01-03 11:06:37  Ranaveer Singh, Sara Ali khan, Simba

హైదరాబాద్, జనవరి 3: బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ .. సారా అలీఖాన్ జంటగా హిందీలో సింబా సినిమా తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరణ్ జొహార్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఎన్టీఆర్ చేసిన టెంపర్ సినిమాకి రీమేక్. విడుదలైన రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

దేశ వ్యాప్తంగా ఈ మూవీ తొలి అయిదు రోజుల్లోనే 124 కోట్లను రాబట్టింది. ఇలా చాలా తక్కువ సమయంలోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. పెళ్లి తరువాత రణ్ వీర్ అందుకున్న భారీ విజయం ఇది. బలమైన కథాకథనాలు .. రణ్ వీర్ యాక్షన్ .. సారా అలీఖాన్ గ్లామర్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా విజయంతో సారా అలీఖాన్ బిజీ కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మొత్తానికి టెంపర్ కథ హిందీలోనూ విజయవిహారం చేస్తోందన్న మాట.