గ్రూప్-1 ఆఫీసర్‌గా అపాయింట్‌మెంట్ అందుకున్న పీవీ సింధు

SMTV Desk 2017-07-27 18:11:28  PV Sindhu, badminton player sindhu, AP CM tweet about PV Sindhu, Group-1 officer sindhu

అమరావతి, జూలై 27: ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్రవేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 2016 ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తానని అప్పట్లో ప్రకటించారు. ఇటీవల గ్రూప్‌-1 ఆఫీసర్‌గా అపాయింట్‌మెంట్ లెటర్ పీవీ సింధుకు ఇస్తున్న ఫొటోని ఆయన తన ట్విట్ట‌ర్‌ ఖాతాలో పెట్టారు. దేశానికి సింధు మరింత పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు ఈమేరకు ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.