టీఆరెస్ కి షాక్...కాంగ్రెస్ నేతల్లో చిరునవ్వులు...

SMTV Desk 2019-01-02 20:23:46  MRF, KPS, CITU, TRS, TMS, Congress party, MLA, Jaggareddy, KPS, Chintha prabhakar

సంగారెడ్డి, జనవరి 2: ఎమ్మార్‌ఎఫ్ కార్మిక సంఘం ఎన్నికల్లో ఊహించని విధంగా కేపీఎస్-సీఐటీయూ కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గుర్తింపు కార్మిక సంఘం టీఎంఎస్ ఓడిపోవడం కొసమెరుపు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బలపరిచిన కేపీఎస్, సీఐటీయూ కూటమి 321 ఓట్లతో గెలుపొందటం విశేషం. ముందస్తు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతాప్రభాకర్‌పై 2589 ఓట్లతో విజయం సాధించారు. తాజాగా ఈ గెలుపు స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.