లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్పందించిన శివాజీ

SMTV Desk 2019-01-02 18:23:17  Ram gopal varma, Shivaji, Lakshmis NTR, Laxmi parvati

అమరావతి, జనవరి 2: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నటుడు శివాజీ తీవ్ర స్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన శివాజీ, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్పందించారు. వెన్నుపోటుకు వెన్నుదన్నుకు తేడా తెలియని వ్యక్తి సినిమాలు తీస్తున్నారంటూ విమర్శించారు. రామ్ గోపాల్ వర్మ సినిమాను తాను వ్యతిరేకించడం లేదన్న శివాజీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏం ఉంటుందో చూద్దాం అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలలో ఎన్టీఆర్ బయోపిక్ కు మంచి గుర్తింపు ఉందన్నారు. లక్ష్మీ పార్వతికి ఏం చరిత్ర ఉందని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు సినీనటుడు శివాజీ. హోటల్ వైశ్రాయ్ ఘటనకు లక్ష్మీపార్వతి మనుషులే కారణం అంటూ శివాజీ ఆరోపించారు.