చంద్రబాబు కన్ను ఇప్పుడు జనసేన పైనా...???

SMTV Desk 2019-01-02 18:10:54  Chandrababu, TDP, Janasena, YSRCP, MP, Viajay sai reddy

అమరావతి, జనవరి 2: ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి చంద్రబాబు పై ఆసక్తికర విషయాలు తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చంద్రబాబు తన కోవర్టులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి ఆ పార్టీని నాశనం చేశాడని ఇప్పుడు జనసేన పార్టీలోకి కూడా టీడీపీ నాయకులను పంపించి ఆ అధినేత పవన్ కళ్యాణ్ ను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల రాజకీయం అన్ని వేళలా, అంతటా పనిచేయదని విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఖమ్మంలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీఆర్‌ఎస్‌లో చేరిపోమంటున్నారని ఆరోపించారు. ఐదు నెలలు ఓపికపడితే చంద్రబాబుని వదిలించుకోవచ్చన్నారు.మరోవైపు రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నలు సంధించారు. ప్రధానిగా రాహుల్ గాంధీకి అంత సీన్ లేదన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు నుంచి ఎందుకు స్పందన లేదని విమర్శించారు. రెండు ఎంపీ సీట్లు రాని చంద్రబాబు డిసైడ్ చేసేదేమిటని ప్రశ్నిస్తారా? లేక ఆయన చెప్పే మాయ మాటలకు అందించే మూటలకు మురిసి పోయి సరెండర్ అవుతారా? అంటూ కాంగ్రెస్ ని ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి.