న్యాయవాదులకు సుప్రీం కోర్ట్ షాక్

SMTV Desk 2019-01-02 17:39:26  AP, High court, Supreem court, Lawyers, Petitions

అమరావతి, జనవరి 2: ఏపీ న్యాయవాదులు ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మౌలిక వసతులు కల్పించడకుండానే హైకోర్టును విభజించారంటూ ఏపీ న్యాయవాదుల వేసిన పిటిషన్‌పై జస్టిస్ సిక్రి, నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.. ఈ విషయంలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవనంతో పాటు మరికొన్ని నిర్మాణాలు పూర్తికానందున రాష్ట్రపతి జారీ చేసిన ఉమ్మడి హైకోర్టు విభజన నోటిఫికేషన్‌ అమలును వాయిదా వేయాలంటూ ఏపీ న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మౌలిక వసతులు ఏర్పాటయ్యే వరకు సిబ్బంది, న్యాయవాదులు అమరావతికి మకాంను మార్చేందుకు సిద్ధంగా లేరని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.