రేపు విచారణకు హాజరవనున్న రవితేజ?

SMTV Desk 2017-07-27 18:03:49  Ravi teja, Drugs Case, Sit, Officials, Inquiry

హైదరాబాద్, జూలై 27 : డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా ఇప్పటి వరకు ఎనిమిది మందిని విచారించిన సిట్ అధికారులు. రేపు సినీ హీరో రవితేజ ను విచారించనున్నారని సమాచారం. ఈ విచారణలో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో రవితేజ తమ్ముడు భరత్ చాలా సార్లు డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ విధంగా రవితేజ కూడా డ్రగ్స్ వాడుతున్నారని దీనిపై సిట్ అధికారులు విచారించనున్నారు. కెల్విన్ ఎలా పరిచయం? కెల్విన్ తో ఎలాంటి సంబంధం ఉంది? పూరి జగన్నాధ్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నారా? మీరు పబ్బులకు వెళ్ళేవారా? ఇలాంటి ప్రశ్నలే కాకుండా మరిన్ని ప్రశ్నలతో సిటి అధికారులు విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది.