ముగిసిన ముమైత్ విచారణ

SMTV Desk 2017-07-27 17:35:04  Mumaith Khan, Drugs Case, Sit Officials, Inquiry

హైదరాబాద్, జూలై 27 : డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా ఇప్పటి వరకు ఏడుగురిని విచారించిన సిట్ అధికారులు ఈ రోజు ముమైత్ ఖాన్ ను విచారించారు. ఉదయం 10.00 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం ఆరున్నర గంటల పాటు ముమైత్ ను సిట్ అధికారులు విచారించారు. కెల్విన్ ఎలా పరిచయం?, డ్రగ్స్ అమ్మకాలు జరిపారా?, తీసుకున్నారా?, సినిమా ఫంక్షన్ లో కెల్విన్ ను కలిశారా?, పూరి, చార్మి తో ఎప్పటి నుంచి సంబంధం ఉంది?, పోకిరి సినిమాతోనే పూరి మీకు తెలుసా?, ఎక్కువ ఐటం సాంగ్స్ చేసే మీరు చిత్ర యూనిట్ తో కలిసి విదేశాలకు ఎందుకు వెళ్ళేవారు? తరుణ్, నవదీప్ ల పబ్బులకు ఎన్ని సార్లు వెళ్ళేవారు?, లాంటి ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అయితే ఈ ప్రశ్నలన్నింటికి ముమైత్ సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది.