చైనాకు బ్రేక్ వేసిన శ్రీలంక

SMTV Desk 2017-07-27 17:25:12  Srilanka, China, Srilanka port area, China silk route

కొలంబో, జూలై 27: శ్రీలంక ఓడరేవులపై డ్రాగన్ దేశ అజమాయిషీ తగ్గించాలని అక్కడి సర్కారు నిర్ణయం తీసుకుంది. దీని నిమిత్తం శ్రీలంక ప్రభుత్వం, చైనా ప్రభుత్వ రంగ ఓడరేవుల నిర్మాణ సంస్థ అయిన మర్చంట్ పోర్ట్ హోల్డింగ్స్‌తో చేసుకున్న ఒప్పందంలో మార్పులు చేసింది. శ్రీలంకలోని హంబన్‌ తోటలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద షాపింగ్ మాల్స్ ఉన్న ప్రాంతానికి సమీపంలో రూ.7,399 కోట్ల వ్యయంతో చైనా నౌకాశ్రయాన్ని నిర్మించింది. ఆ నౌకాశ్రయంలో 80 శాతం వాటాలను ఆ సంస్థ తీసుకుంది. చైనా సిల్క్ రూట్ పునరుద్ధరణ పేరిట ఆసియాలోని పలు దేశాల మీదుగా జల, భూమార్గాలను నిర్మిస్తున్న సంగతి విధితమే. ఇందువల్ల మా భూములు పోతాయని అక్కడి ప్రజలు ఉద్యమించారు. భారత్‌తో పాటు జపాన్, అమెరికా కూడా వ్యతిరేకించాయి. ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత, అంతర్జాతీయంగా అభ్యంతరాల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం పునరాలోచనలో పడి కెబినేట్ సమావేశానంతరం హంబన్‌తోట ఓడరేవుపై చైనా పెత్తనాన్ని తగ్గించింది.