బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో 3 వ చిత్రం...

SMTV Desk 2018-12-31 17:21:33  

హైదరాబాద్ , డిసెంబర్31: బన్నీ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా ‘జులాయి , ‘సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి హిట్‌ల సినిమాల కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. అల్లు అర్జున్ 19వ సినిమాగా ఇది రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అందరికీ చిత్ర బృందం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన ‘AA19 అనే హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్‌ ఇండియా ట్రెండింగ్‌లో మూడో స్థానంలో ఉంది.