​న్యూ ఇయర్​ సందర్బంగా ​​ రాజశేఖర్ 'కల్కి'​ ఫస్ట్ లుక్ ​..!!

SMTV Desk 2018-12-31 13:36:06  rajasheakar,garudavega,prashanth,kalki,kalyan c,telugumovie

హైదరాబాద్, డిసెంబర్ 31: గరుడ వేగ హిట్ తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం కల్కి .
ప్రశాంత్ వర్మ వినిపించిన ఈ కథ నచ్చడంతోనే మొదట్లోనే ఓకే చేసారు. అలా సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది.
ప్రశాంత్ వర్మ వొక విభిన్నమైన కథను సెట్స్ పైన రూపొందిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో .. రాజశేఖర్ యాక్షన్ మార్క్ తో కూడినదిగా ఈ సినిమా ఉంటుంది ఈ చిత్రం. రాజశేఖర్ పాత్ర చాలా పవర్ఫుల్ గా వుండనుందనే విషయం టైటిల్ ను బట్టే అర్థమైపోతోంది. రాజశేఖర్ , మరో నిర్మాత సి. కల్యాణ్ తో కలిసి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కూడా తనకి హిట్ ఇస్తుందనే పూర్తి నమ్మకంతో రాజశేఖర్ వున్నారు.